calender_icon.png 13 November, 2025 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్ఫ్ బాధితుడి కోసం..

20-05-2024 12:57:34 AM

విదేశీ వ్యవహారాల శాఖకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి  మెసేజ్

జగిత్యాల, మే 19(విజయక్రాంతి) :  బతుకు దెరువు కోసం అరబ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ యువకులను ఏదో రకమైన మోసాలకు గురి చేస్తూ అరబ్ విడిచి వెళ్లొద్దంటూ ఆంక్షలతో బందీ చేస్తున్నారని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల కటికెవాడ కు చెందిన గొల్లపెల్లి రాజేష్ (39)  బతుకు దెరువు కోసం గత డిసెంబర్ లో ఆజాద్ వీసాపై దుబాయికి  వెళాడు. ఎంప్లాయిమెంట్ వీసా ఉన్నా సరైన ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఒక ముఠా మోసపూరిత మాటలు నమ్మి అక్కడ కేసులో ఇరుక్కుపోయాడు. బ్యాంకుల దారా అప్పు తీసుకుని ఏదైనా బిజినెస్ చేయొచ్చని ఒక ముఠా రాజేష్ ను నమ్మించి అతనితో బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేయించింది.

అనుమానాస్పద బ్యాంక్ అకౌంట్ల గురించి దర్యాప్తు కోసం దుబాయి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు పూర్తి అయ్యేవరకు దుబాయి దాటి వెళ్లొద్దంటూ రాజేష్ పై ట్రావెల్ బ్యాన్ (ప్రయాణ నిషేధం) విధించారు. దుబాయిలో బ్యాంకు మోసాల ముఠా ఉచ్చులో చిక్కుకున్న రాజేష్ ను రక్షించాలని అతని కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. వెంటనే ఖ్య మంత్రి కార్యాలయం (సీఎంఓ) దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయం కోసం ప్రభుత ప్రధాన కార్యదరి దారా దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత శాఖ కార్యాలయానికి మెసేజ్ పంపించినట్లు జీవన్‌రెడ్డి వెల్లడించారు.