calender_icon.png 13 November, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న గెలుపునకు కృషి

20-05-2024 12:56:28 AM

భద్రాద్రి కొత్తగూడెం, మే 19 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించుకుంటామని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న టీం సమన్వయ కర్త తుళ్లూరి బ్రహ్మయ్య అధ్యక్షతన ఆదివారం పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయా పార్టీల నాయకులు.. శక్తి వంచన లేకుండా పనిచేసి మల్లన్నను గెలిపించుకుంటామని అన్నారు. సమావేశంలో డీసీఎంస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.