calender_icon.png 13 November, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీ - పాల వ్యాన్ ఢీ

20-05-2024 12:58:53 AM

ఒకరు మృతి, మరొకరికి సీరియస్

జగిత్యాల, మే 19(విజయక్రాంతి) : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పూడూరు గ్రామ ప్రధాన రహదారి బ్రిడ్జిపై ఆదివారం ఉద యం పాల వ్యాన్ లారీ ఎదురెదురుగా ఢీ కొనడంతో పాల వ్యాన్ డ్రైవర్ మృతి చెందారు. లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొడిమ్యాల ఎస్‌ఐ సందీప్ కథనం ప్రకారం కరీంనగర్ రూరల్  మండలం సీతరాంమ్‌పూర్  నుండీ టీఎస్ 02 వ్యాన్ లో పాలు లోడ్ చేసుకొని నిజామాబాద్ జిల్లా భీంగల్ వెళ్తుండగా కరీంనగర్  ప్రధాన రహదారి పూడూర్ గ్రామ బ్రిడ్జిపై  రాజస్థాన్ నుండి వస్తూన్న జీఎస్ లారీ అతివేగంగా ఢీ  కొట్టడంతో వ్యాన్ డ్రైవర్ దామెర రాజేశ్వర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న లారీ డ్రైవర్ వీరంభా యిని చికిత్స కోసం కరీంనగర్ ఆస్పుత్రికి  తరలించినట్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ సందీప్ తెలిపారు. కాగా అతి వేగంగా  లారీ వ్యాన్ ఢీ కొట్టడంతో వాహనాలు రెండు హత్తుకుపోవ డంతో  కరీంగనర్  జగిత్యాల ప్రధాన రహదారిపై రెండు గంటలు పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి  ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో క్రేన్ సహయంతో వ్యాన్ లారీ పక్కకు తొలగించిన పోలిసులు వాహనాల రాకపోకలు క్లియర్ చేశారు.