31-12-2025 12:33:25 AM
మంచిర్యాల, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకొని జిల్లాలోని ప్రధాన దేవాలయాల్లో మంగళ వారం మహిళా భక్తుల భద్రత కోసం మంచిర్యాల షీ టీం సిబ్బంది ప్రత్యేక డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాయి.
అధిక సంఖ్యలో మహిళా భక్తులు, బాలికలు తరలివచ్చిన ఆలయాల వద్ద మహిళలపై వేధింపులను అరికట్టడానికి దేవాలయ పరిసరాలు, క్యూ లైన్లు, బస్ స్టాండ్లు, పార్కింగ్ స్థలాలు, షాపింగ్ ఏరియాల్లో సివిల్ డ్రెస్లో షి టీమ్ సిబ్బంది భక్తులతో కలిసిపోయి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు.
మహిళా భక్తులపై అసభ్యంగా ప్రవర్తించడం, ఫోన్ లలో ఫోటోలు, వీడియోలు తీయడం, ఈవ్టీజింగ్ వంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. మహిళలు, ఎలాంటి భయం లేకుండా పబ్లిక్ ప్రదేశాల్లో స్వేచ్ఛగా తిరిగేల రక్షణ వాతావరణం కల్పించారు.