calender_icon.png 6 October, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపు గుర్రాల కోసం

06-10-2025 12:00:00 AM

  1. జడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పార్టీల దృష్టి

కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ 

కరీంనగర్, అక్టోబర్ 5 (విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి గ్రామా ల్లో మొదలయింది. నాలుగు జిల్లా ల జడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేట మొదలు పెట్టాయి. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బి సి జనరల్ కు , పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం జనరల్ మహిళకు, జగి త్యాల జనరల్ మహిళ, సిరిసిల్ల ఎస్ సి జనరల్ కు కేటాయించడంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఎస్సీ, బీసీ, జనరల్ స్థానాల్లో పోటీ చేసే మహిళలకు పెద్దపల్లి, జగిత్యాలలో చైర్మన్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే బి సి జనరల్, జనరల్ స్థానాల నుండి పోటీ చేసే వారికి కరీంనగర్ లో అవకాశం. ఎస్ సి జనరల్, ఎ స్సీ మహిళ స్థానాల నుండీ పోటీ చేసే వారికి సిరిసిల్ల లో అవకాశం ఇంది ఉంది. కరీంనగర్ లో 15, జగిత్యాలలో 20, రాజన్న సిరిసి ల్లలో 13, పెద్దపల్లి జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి.

ఖరారు చేసిన రిజర్వేషన్ల ప్రకారం కరీంనగర్ జిల్లాలో జెడ్ పి చైర్మన్ కి పోటీ చేసే వారికి కొత్తపల్లి, గంగాధర, గన్నేరువరం జనరల్, చొప్పదండి, ఇల్లందకుంట, వీణవంక, బిసి జనరల్ స్థానాలు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో జగిత్యాల రూరల్, ఇబ్రహీం పట్నం, ధర్మపురి జనరల్, కథలపూర్, బు గ్గరం, మల్లాపూర్ జనరల్ మహిళ, మెట్పల్లి , సారంగపూర్, వెల్గటూర్, జగిత్యాల అర్బన్, పెగడపల్లి, మేడిపల్లి, బీమారం బి సి మహిళ కు కేటాయించారు.

పెద్దపల్లి జిల్లాలో ధర్మా రం ఎస్సీ జనరల్, జూలపల్లి మహిళ, పాలకుర్తి ఎస్సీ జనరల్, ఎలిగేడు జనరల్, కమా న్పూర్ జనరల్ మహిళ, ముత్తారం జనరల్, ఓదెల జనరల్ మహిళ, అంతర్గాం బీసీ మ హిళ, మంథని బీసీ జనరల్, పెద్దపల్లి బీసీ మహిళ, రామగిరి బీసీ, రామగిరి బీసీ జనరల్, కాల్వ శ్రీరాంపూర్ బీసీ మహిళ, సు ల్తానాబాద్ బీసీ జనరల్ కు కేటాయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి ఇల్లంతకుంట (ఎస్ సి మహిళ), కో నరావుపేట, వేములవాడ రూరల్ (ఎస్ సి జనరల్) స్థానాల నుంచి గెలిచేవారికే ప్రత్యక్షంగా అవకాశం ఉంది.

చందుర్తి (జనరల్), వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట (జనరల్ మహిళ) నుంచి ఎస్ సి లు గెలిస్తే పరోక్షంగానూ అవకాశం దక్కవచ్చు. ఆయా జిల్లాలలో ఈ స్థా నాల నుండి ఎవరు గెలిచినా కూడా వారికి జిల్లా పరిషత్తు చైర్మన్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఏ పార్టీ మెజార్టీ స్థానాలు సాధిస్తుందో ఆ పార్టీకి చెందిన వారు జడ్పీ చైర్మన్ కానున్నారు. జిల్లా పరిషత్తు చైర్మన్ పదవిని దృష్టిలో పెట్టుకొని అధికార కాంగ్రెస్ పార్టీ సహా భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి నాయకులు అభ్యర్థుల వేటలో పడ్డా రు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే విధంగా బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఎవరిని నిలబెడితే బాగుంటుందనే వి షయమై అభ్యర్థుల వేటలో పడ్డారు.

ఆయా పార్టీలు గెలుపు గుర్రాల కోసమే వేట ఆరంభించగా, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీస్తున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన నాయకులు అధి కార కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఇస్తే ఆ పార్టీలో చేరేందుకు పలువురు నాయకులు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల్లో ఇప్పటి వర కు తెర మీద లేనటువంటి నాయకులు ఆకస్మికంగా పుట్టుకు వస్తున్నారు. పార్టీలు ఎవరి ని అభ్యర్థిగా నిలబెడతారో తెలియని పరిస్థితి నెలకొన్నది.

ప్రధానంగా ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్‌ఎస్, బీ జేపీకి చెందిన నాయకులు అప్పుడే వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే ఈనెల 8వ తేదీన హైకోర్టు తుది విచారణలో ఏమి తెలుస్తుందో అనే విషయమై కూడా కొంద రు నాయకులు వేచి చూస్తామనే ధోరణితో ఉన్నారు.

హైకోర్టు తీర్పు బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా వస్తే ఆ మరుసటి రోజు నుం చే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. దీంతో ఆయా రాజకీ య పార్టీలు ముందు జాగ్రత్తతో ఇప్పటి వర కు ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో ఆచితూచి అడుగువేస్తున్నారు.