01-10-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ముంబై 26/11 ఉగ్రదాడుల తర్వాత విదేశాల నుంచి వచ్చిన ఒత్తిళ్లు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వైఖరి కారణంగానే పాకిస్థాన్‌పై ప్రతీకార దాడులు చేయలేకపోయామని మాజీ కేంద్ర హోం మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పష్టం చేశారు. తాజాగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లోకలకలం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. అసలు చిదంబరం ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారంటే.. 26/11 దాడులు జరిగిన కొన్నాళ్లకే తాను కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని, 26/11 దాడులకు ప్రతీకార దాడులు జరిగాల్సిందేనని భావించానని గుర్తుచేసుకున్నారు.
కానీ, యూపీఏ ప్రభుత్వం ప్రతీకార దాడులు చేయొద్దని విదేశీ ఒత్తిళ్లు వచ్చాయని, అప్పటి అమెరికా విదేశాంగశాఖ మంత్రి కండోలీజా రైస్ భారత్‌కు వచ్చి నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారని తెలిపారు. ఆమె స్వయంగా ఉగ్ర దాడులపై స్పందించవద్దని విజ్ఞప్తి చేశారని, యూపీఏ ప్రభుత్వం చివరకు పాకిస్థాన్‌పై సైనిక చర్యకు వెనుకడుగు వేసిందని స్పష్టం చేశారు. తాను ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నాటి పీఎం మన్మోహన్‌సింగ్‌తో పాటు ఎంతోమంది ప్రభుత్వ పెద్దలను కోరానని, అయినా ఫలితం లేయపోయిందని చెప్పుకొచ్చారు. చిదంబరం వ్యాఖ్యలపై
బీజేపీ నేత, కేంద్ర మంత్రి విమర్శలు
మాజీ కేంద్ర హోంత్రి చిదంబరం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్ర హ్లాద్ జోషి స్పందిస్తూ.. దాడులు జరిగిన 17 సంవత్సరాల తర్వాత మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అం గీకరించారని, ఇంత వ్యవధి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. విదేశీ శక్తుల ఒత్తిడి కారణంగా ముంబై దాడులకు ప్రతీకారం తీర్చుకోకపోవడం దారుణమ ని, యూపీఏ ప్రభుత్వం దారుణమై న వైఖరి అవలంబించిందని మండిపడ్డారు.
బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. ‘ముంబై ఉగ్రదాడుల తర్వాత హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు చిదంబరం ఇష్టపడలేదు. ఆ యన పాకిస్థాన్‌పై సైనిక చర్య కోరినప్పటికీ ఇతరులు ఆయన్ను నిలువ రించారు. సైనిక చర్యను బహుశా ఏఐసీసీ అధి నాయకురాలు సోనియాగాంధీనే అడ్డుపడి ఉంటారు. భారత సైనిక చర్య పై విదేశీ శక్తుల ప్రభావం ఉండటం శోచనీయం’ అని ‘ఎక్స్’లో పోస్టు చేశారు.