01-10-2025 12:00:00 AM
తిరుమల, సెప్టెంబర్ 30: తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్స వాలను తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. కాగా మంగళవారం రాత్రి స్వామి వారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రుడు శివునికి శిరోభూ షణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం.
చంద్రప్రభ వాహనంపై తిరుమలేశుని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగింది. గోవింద నామస్మరణతో తిరుమల మార్మోగింది. వాహన సేవకు ముందు కళాబృందాల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నా యుడు, ఈవో అనిల్‌కుమార సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు వాహన సేవలొ పాల్గొన్నారు.
ఉదయం శ్రీవారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహ నంపై భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమలేశుని వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించారు.