calender_icon.png 1 January, 2026 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి మాస్టర్ ప్లాన్‌పై మంత్రి సమీక్ష

01-01-2026 12:38:16 AM

జూలై 23 2027 నుంచి ప్రారంభం కానున్న పుష్కర ఏర్పాట్లపై సమీక్ష 

భద్రాచలం రామాలయం మాడ వీధుల విస్తరణ ఆగమశాస్త్రం ప్రకారం జరగాలి

దశల వారీగా మూడేళ్లలో విస్తరణ పనులు పూర్తి చేయాలి

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన 

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు

దేవాదాయ శాఖ కమిషనర్‌కు మంత్రి తుమ్మల దిశానిర్దేశం

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 31, (విజయక్రాంతి): దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య ఆలయం నూతన శోభ సంతరించుకొనుంది. మార్చి 2026 లో శ్రీరామనవమి సీతారామ కళ్యాణం నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్షించారు. భద్రాద్రి రామయ్య అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న భూ సేకరణకు కాంగ్రెస్ సర్కారు ముఖ్యమంత్రి ఆదేశాలతో రూ. 34 కోట్లు విడుదల చేయడంతోభూసేకరణ పూర్తి చేయడం జరిగింది. ఆలయం విస్తరణ పనులు కోసం భూసేకరణ పూర్తవడంతో ఆలయం మాడ వీధుల విస్తరణ ప నులు, ప్రాకార నిర్మాణాలు చేపట్టాలని, ఆగమ శాస్త్రం ప్రకారం ఆర్కిటెక్ట్ ఇచ్చిన డిజై న్లు (మాస్టర్ ప్లాన్) ముఖ్య మంత్రి ఆమోదం తో ఫైనల్ చేసి పనులు మొదలు పెట్టాలని మంత్రి తుమ్మల సూచించారు.

దీంతో దక్షిణ అయోధ్య టెంపుల్ సిటీకి అడుగులు పడనున్నాయి.భద్రాచలం రామాలయం మాడ వీధుల విస్తరణ పనులు ఆగమ శాస్త్రం ప్రకా రం నిర్మాణం చేయాలని మంత్రి తుమ్మల తెలిపారు. బుధవారం హైదరాబాద్ సచివాలయం లో దేవాదాయ శాఖ కమీషనర్ హరీష్ తో ఆలయ విస్తరణ పనులు పై మంత్రి తుమ్మల చర్చించారు. ఈ సందర్భం గా మంత్రి తుమ్మల మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం రామాలయం 1664 లో భక్త రామదాసు నిర్మాణం చేశారు. పెరుగుతున్న భక్తుల సౌక ర్యం కోసం ఆలయం విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రామా లయం మాడ వీధుల విస్తరణ పనులు దశల వారీగా మూడు ఏళ్ళలో పూర్తి చేయాలని దేవాదాయ శాఖ కమీషనర్ హరీష్ కు మంత్రి తుమ్మల దిశా నిర్దేశం చేశారు.

భారతదేశానికి తలమానికంగా దక్షిణ అయో ధ్యగా పేరుగాంచిన భద్రాద్రి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూసేకరణ సమస్యకు ఎట్టకేలకు మంత్రి తుమ్మల పరిష్కారం చూపా రు.శ్రీరామచంద్రుడి ఆలయ అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో భద్రాద్రి ఆలయం నూతన శోభ సంతరించుకొనుంది. ఆగమ పండితులు రూపొందించిన నమూనాల ప్ర కారం అభివృద్ధి పనులను ప్రారంభించేలా మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించా రు.  కుంభమేళా తరహాలో భద్రాచలం లో పుష్కరాల ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల సూచించారు.

దక్షిణ అయోధ్య గా భా సిల్లుతున్న భద్రాచలం రామాలయం దర్శనానికి , గోదావరి నదిలో పుష్కర స్నానానికి లక్షలాది మంది భక్తులు వస్తారని ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్నానాల ఘాట్లు ఏ ర్పాటు చేయాలని వసతి కేంద్రాలు, మెడికల్ క్యాంప్ లు శానిటేషన్, తాగునీరు, రవాణా సౌకర్యాలు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని ప్ర భుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని పు ష్కరాల ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మ ల దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా చేప ట్టాల్సిన ముందస్తు ప్రణాళికలు పై ఎండోమెంట్ కమీషనర్ కు మంత్రి తుమ్మల తన అనుభవాలు వివరించారు.