calender_icon.png 20 August, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో చేరిన బిజెపి మాజీ మండలాధ్యక్షుడు

19-08-2025 10:57:24 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన బిజెపి తాడ్వాయి మండల శాఖ మాజీ అధ్యక్షులు షేర్ బద్దం  రమణారెడ్డి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్మోహన్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు తాను ఆసక్తి పెంచుకొని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యాం రావు తదితరులు పాల్గొన్నారు.