calender_icon.png 20 August, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు ఆసరాగా సీఎం సహాయనిధి

19-08-2025 11:00:31 PM

మునుగోడు,(విజయక్రాంతి): సీఎం సహాయనిధి పేదలకు ఆసరాగా నిలిచి ప్రాణాలను కాపాడుతోందని చండూర్ మార్కెట్ చైర్మన్ దొటి నారాయణ ,మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయ నిధితో నేడు నిరుపేదలు కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకుంటున్నారని తెలిపారు. నిరుపేదల ఆరోగ్యం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.