31-07-2025 12:00:00 AM
మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆర్థిక సాయం
బోయినపల్లి జూలై 30 (విజయక్రాంతి) బోయినపల్లి మండలం బూరు గుపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ అతికం లచ్చయ్య గౌడ్ బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించి కుటుం బ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ సందీ ప్ కుమార్ ఝా తో ఫోన్లో మాట్లాడి ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందే విధంగా ఆయన కోరారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు రూపాయలు ఐదువేల నగదును ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వారికి అందించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి మహేష్ రెడ్డి, ఏ ఏం సి చైర్మన్ ఎల్లేష్, కాంగ్రెస్ నాయకులు సంబ లక్ష్మీనరజం, కనకయ్య, పిట్టలమోహన్లున్నారు.