calender_icon.png 29 January, 2026 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు అమలుచేయని కాంగ్రెస్.. ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టండి

29-01-2026 12:50:54 AM

మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు, జిల్లా అధ్యక్షులు డి.నారాయణ

వనపర్తి టౌన్ జనవరి 28 : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టాలని మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు, జిల్లా అధ్యక్షులు డి.నారాయణ లు అన్నారు. బుధవారం స్థానిక నాయకులతో కలిసి వనపర్తి మున్సిపాలిటీలో బిజెపి రాష్ట్ర నాయకు లు మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు పర్యటించారు. మున్సిపాలిటీ 13 వ వార్డు లో కొండోజు గోపీనాథ్ నామినేషన్ సందర్భంగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చిన మహిళల ఉద్దేశించి మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ అ బద్ధపు గ్యారంటీలు అమలుకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాడన్నారు.

ఎన్నికల ముందు లంకె బిందెలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రగల్ బాలు పలికి నేడు నా బట్టలిప్పి కొ ట్టిన రూపాయి అప్పు పుట్టడం లేదు బ్యాం కుల ముందుకు వెళితే చెప్పులు ఎత్తుకుపోయే దొంగల చూస్తున్నారని పాలనను చే తులెత్తేశాడన్నారు.

గత మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డులో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన మధుసూదన్ రెడ్డి తనకు అనుకూలంగా రిజర్వేషన్ రాకపోయినా బీసీ సోద రుని కోసం ముందుండి గెలిపించడానికి ప్రతిన భూనడం అంటే బిజెపి పార్టీకే ఇది సాధ్యమని ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికల్లో వనపర్తి మున్సిపాలిటీలో బిజెపి జెండా ఎగురవేయబోతుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. విజ్ఞులైన వనపర్తి ప్రజలంతా బిజె పికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పెద్ద మెజార్టీతో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ ఆర్. లోకనాథ్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగా రి ప్రభాకర్ రెడ్డి సబిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.