calender_icon.png 29 January, 2026 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం తీరు మార్చుకోవాలి

29-01-2026 12:52:24 AM

పార్లమెంట్ ఇంచార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేణుగౌడ్

మహబూబ్ నగర్ టౌన్, జనవరి 28 : పేదల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉపాధిహామీ పథకంలో మార్పులు చేసిందని పార్లమెంట్ ఇన్చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేణుగౌడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఆయన డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం 60శాతం, రాష్ట్రం 40 శాతం ఖర్చు చేసేలా ఉపాధిహామీ చట్టాన్ని మార్చినట్లు తెలిపారు. ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఉపాధిహామీ పథకంలో మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామాల్లోకి వెళ్లి తీర్మానాలు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లు ఉన్నచోట గ్రామ పంచాయతీ, లేనిచోట గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చేలా సవరణలు చేసిందని ఆరోపించారు. ఉపాధిహామీ పథకాన్ని యదావిధిగా కొనసాగించాలని గ్రామాల్లో తీర్మానాలు చేయించి టీపీసీసీ పంపిస్తామని అన్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో తీర్మానాలు చేయడం జరిగిందని, ఇంకా మిగిలిన గ్రామాల్లో పూర్తి కానున్నట్లు తెలిపారు. సమావేశంలో పరిశీలకులు జంగారెడ్డి, రామారావు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, నాయకులు చంద్రకుమార్ గౌడ్, సీజే బెనహర్, నయీమ్, రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.