05-07-2025 04:29:49 PM
ఇండియా టీంకి ఆడాలి..
చైతన్య శ్రీని సన్మానించిన మాజీ మంత్రి హరీశ్ రావు..
సిద్దిపేట (విజయక్రాంతి): జాతీయ స్థాయి అండర్-17 ఫుట్బాల్ టీం ప్రాబబుల్స్ కు ఎంపిక అయిన సిద్దిపేట ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారిణి చైతన్య శ్రీ ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జాతియ మహిళా ఫుట్బాల్ టీం లో ఎంపికయి సిద్దిపేట పేరు నిలబెట్టాలన్నారు. ఈ సందర్బంగా అల్ ది బెస్ట్ చెప్పారు. కార్యక్రమంలో సిద్దిపేట ఫుట్బాల్ కోచ్ అక్బర్ నవాబ్, సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సాజిద్, చైతన్య శ్రీ ఫాదర్ రాము తదితరులు పాల్గొన్నారు.