calender_icon.png 5 July, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడూరు ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.51 వేల విరాళం

05-07-2025 04:32:44 PM

కామారెడ్డి (విజయక్రాంతి): ఆదిత్య హాస్పిటల్స్(Aditya Hospitals) అధినేత చిలువేరి శ్రీదేవి మారుతి వారి కుమారుడు అభినవ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని, రూ.51 వేల రూపాయలు కోడూరి ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం కొరకు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వారిని వేదపండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆశీర్వదించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని దాతలు ముందుకు వచ్చి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న పురాతన కోడూరు ఆంజనేయస్వామి క్షేత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆంజనేయ శర్మ కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెంట నర్సింలు, భక్తులు, పాల్గొన్నారు.