calender_icon.png 6 July, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ ఆలోచనల వేగాన్ని అందుకోవాలి

06-07-2025 12:01:37 AM

క్రీడా శాఖపై సమీక్షలో మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): క్రీడలను శిఖర స్థాయికి చేర్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు క్రీడా శాఖ పనితనంలో కొత్తదనం కనిపించాలని రాష్ర్ట యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో క్రీడా శాఖపై స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులతో మంత్రి శ్రీహరి మాట్లాడు తూ గతంలో జరిగిన వైఫల్యాలను అలసత్వాన్ని పక్కనపెట్టి నూతన ఒరవడితో క్రీడా శాఖలో కొత్తదనం కనిపిం చాలని, సీఎం రేవంత్ ఆలోచనల మేరకు  క్రీడా శాఖ ప నితనం ఉన్నత స్థాయిలో ఉండాలని సూచించారు. 2036 ఒలంపిక్స్‌లో పతకాలు లక్ష్యంగా తెలంగాణ క్రీడా శాఖ పనిచేయాలని, చిత్తశుద్ధితో పనిచేస్తే లక్ష్యాన్ని సాధించడం సులభతరమైనేనని అన్నారు.