13-09-2025 07:49:22 PM
సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామం రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీర నారి చాకలి ఐలమ్మ విగ్రహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీష్ రావు(MLA Harish Rao), ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ కేవలం గ్రామీణ మహిళ కాదు, పోరాట స్ఫూర్తికి ప్రతీక. పేదల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన త్యాగాలు నేటికీ ప్రేరణనిస్తాయి అన్నారు. రజక సంఘం నాయకులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆశయాలనే మనం ఆచరణలో పెట్టాలి, ఆమె చూపిన మార్గంలో నడవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.