13-09-2025 07:55:45 PM
తప్పెట్ల ప్రగతికి అభినందనలు..
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) మరిపెడ మండలం వెంకంపాహాడ్ గ్రామానికి చెందిన తప్పెట్ల నాగేష్ స్వర్ణ చిన్న కుమార్తె తప్పెట్ల ప్రగతి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(2025) ఫలితాలలో కీటక శాస్త్రం, నెమటాలజీ సబ్జెక్టులో ఆల్ ఇండియా తొమ్మిదో ర్యాంక్ సాధించింది. ఎస్సీ వర్గంలో ఆల్ ఇండియా ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సత్తాచాటారు. ఆల్ ఇండియా ర్యాంకు రావడంతో పలువురు తప్పెట్ల ప్రగతిని రాజకీయ నాయకులు అధికారులు అభినందనలు తెలిపారు. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.