13-09-2025 07:49:19 PM
జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రమాకాంత్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): క్షణికావేశంలో తెలిసి తెలియక చేసిన తప్పుల కారణంగా నమోదైన కేసులను తిరిగి రాజీ కుదుర్చుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ వేదిక రాజమార్గంలాగా మారిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.
సివిల్, ఎలక్ట్రిసిటీ, బ్యాంకు, పిట్టి కేసులు తదితర వివాదాలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. ఈ విధంగా పరిష్కరించుకున్న కేసులు సమయాన్ని, ఖర్చును ఆదా చేస్తాయన్నారు. మొత్తం 23,967 కేసులు పరిష్కారమై, రూ. 61,89,914/- కాంపౌండింగ్ ఫీజు వసూలు చేయబడినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత, రాజీ అయిన కక్షిదారులకు అవార్డు కాపీలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందించారు.