28-11-2025 01:00:25 AM
మంథని, నవంబర్ 27విజయ క్రాంతి : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మానేరు పై నాణ్యత లేకుండా నిర్మించిన చెక్ డ్యాములు కూలిపోవడం పై మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావే బాధ్యత వహించాలని గురువారం మంథనిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టిపిసిసి ఎన్నికల కమీషన్ కో ఆర్డినేషన్ కమీటి సభ్యుడుశశిభూషణ్ కాచే అన్నారు. మానేరు పై దాదాపు రూ. 300 వందలు కోట్లతో నిర్మించిన చెక్ డ్యాములు, ఓడేడు మానేరు పై నిర్మించిన బ్రిడ్జి గాలివానకే కొట్టుకుపోయింది నిజం కాదా అని బీఆర్‌ఎస్ నాయకులను కాచే ప్రశ్నించారు.
మీ ప్రభుత్వంలో మీరే నీటి పారుదల శాఖ మంత్రి గా ఉండి నిర్మించిన కాళేశ్వరం బ్యారేజీ, చెక్ డ్యాములు, బ్రిడ్జిలు నాసిరకం తో నిర్మించి, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని హరీష్ రావు ను విమర్శించారు. అవినీతి కి పాల్పడి నాసరికంతో నిర్మించిన చెక్ డ్యాములపై విజిలెన్స్ అధికారులకు అలాగే రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డికి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఆయన వెంట మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు శంకర్, మంథని సురేష్, పర్షవేని మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.