calender_icon.png 4 August, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి

04-08-2025 07:42:17 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం పాలిసెట్ రాసిన అభ్యర్థులతో పాటు పదవ తరగతి పాసైన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.రమేష్(College Principal Dr. Ramesh) తెలిపారు. కళాశాలలో మెకానికల్ ట్రిపుల్ ఈ సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పాలీసెట్ 10వ తరగతి మెరిట్ ఆధారంగా స్పాట్ అడ్మిషన్లు కల్పించడం జరుగుతుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వించుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 897713946 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.