calender_icon.png 22 October, 2025 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివంగత మాజీ మంత్రి ఆర్ డి ఆర్ సేవలు మరువలేనివి

21-10-2025 05:21:16 PM

నల్లగొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ పింగళి శ్రీ పాల్ రెడ్డి..

తుంగతుర్తి (విజయక్రాంతి): దివంగత మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తన ప్రాణంగా, ఆస్తులను పోగొట్టుకొని చివరి శ్వాస వరకు పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన నాయకుడు ఆర్ డి ఆర్ అని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి కొనియాడారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నివాసంలో మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి.. ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పరామర్శించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తంగేళ్ళ జితేందర్ రెడ్డి,  జిల్లా,డివిజన్, మండల, భాద్యులు తదితరులు పాల్గొన్నారు.