calender_icon.png 10 August, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా

24-07-2025 06:11:34 PM

మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్..

దౌల్తాబాద్ (విజయక్రాంతి): బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్(Former MLC Farooq Hussain) అన్నారు. రాయపోల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గల్వ జీవన్ రెడ్డి సోదరుడు సత్తిరెడ్డి నార్సింగ్ సమీపంలో లారీ ఢీకొని మృతిచెందగా గురువారం కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదవి ఉన్నా లేకున్నా దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం అన్నారు. సత్తిరెడ్డి పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని తమ దృష్టికి వచ్చిందని వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర శర్మ, యాదగిరి, మంజూర్, రాజిరెడ్డి, వెంకట నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.