calender_icon.png 9 August, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల ప్రత్యేక కార్యశాల

24-07-2025 06:04:03 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): గురువారం హసన్ పర్తి మండలం భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) కార్యాలయంలో మండల అధ్యక్షులు మారం తిరుపతి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక కార్యశాల నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, ఆశావాహుల పేర్లు సేకరణ, ఎంపిటిసి ఎన్నికల్లో ముందస్తు ప్రణాళికలు, సమగ్ర కార్యాచరణపై వివరంగా దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు మాజీ ఎంపిటిసి పెద్ది మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రేణుకుంట్ల సునీత, మాజీ ఎంపిటిసి పిట్టల కుమారస్వామి, జిల్లా కార్యదర్శి చల్లగోండ ప్రభాకర్ రెడ్డి, బిజెపి నాయకులు గుర్రాల చంద్రమౌళి, చకిలం రాజేశ్వరరావు, జీల సురేష్ యాదవ్, జిల్లా, మండల పార్టీ పదధికారులు, బూత్ అధ్యక్షులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.