calender_icon.png 13 August, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

24-07-2025 06:19:22 PM

డిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి డిమాండ్..

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపుమేరకు డిటిఎఫ్ మండల అధ్యక్షులు మడాక మధు ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ తహసీల్దార్ కృష్ణకు గురువారం వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలైన అన్ని క్యాడర్ ల బదిలీలు, పదోన్నతులు, అన్ని రకాల పెండింగ్  బిల్లులు, సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ పునరుద్ధరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే విడుదల చేయాలని, 30 అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వీరేశం, సమ్మయ్య, సాంబయ్య, ఆంజనేయులు, శ్రీనివాస్, లీలా రాణి, ప్రసూన, దీపిక, రమేష్  50 మంది ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.