calender_icon.png 30 January, 2026 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఏడు కొత్తలైనా తెచ్చాడా..?

30-01-2026 03:16:58 PM

ఏడేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్… 

రెండు సంవత్సరాల రేవంత్ ప్రభుత్వం రెండు రూపాయలైనా  ఇచ్చిందా..?

 మాజీ ఎం.పీ. బోయినపల్లి వినోద్ కుమార్

కరీంనగర్,(విజయక్రాంతి): ఏడేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్… కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఏడు కొత్తలైనా తెచ్చాడా, రెండు సంవత్సరాల రేవంత్ ప్రభుత్వం రెండు రూపాయలైనా  ఇచ్చిందని మాజీ ఎం.పీ. బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం అల్గునూర్ 8 వ డివిజన్ లో బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జి వి రామకృష్ణ రావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, అభ్యర్థి కాలువ మల్లయ్య యాదవ్ తో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ... పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అలుగునూర్ ను హైదరాబాద్ లెక్క అభివృద్ధి చేశామన్నారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ కు అలుగునూర్ ను ముఖద్వారంగా అభివృద్ధి చేస్తామన్నారు. నాడు నేను ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి నాలుగు గంటలు అలుగు నూరు లో ఇంటింటికి తిరిగి రోడ్డు వెడల్పు చేసేందుకు ప్రజలను ఒప్పించడం జరిగిందని గుర్తు చేశారు. అలుగునూరు లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, కరీంనగర్ ను స్పార్ట్ సిటీ చేసి వెయ్యి కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందని.ప్రజల కాళ్లకు మట్టి అంటకుండా చేసి ప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేయించామన్నారు. 


గులాబీ జెండా ద్వారా ఎంపీగా  గెలిచిన నాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం కలిసి కేంద్రం నుంచి స్పార్ట్ సిటీ కోసం నిధులు తేవడం జరిగిందని, కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ ఒక కొత్త పథకం కరీంనగర్ కు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో మహిళలకు 2500లు, ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలు,తులం బంగారం ఇస్తామని మోసం చేశారన్నారు.బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం చేసిన రోడ్లను కూడా శుభ్రం చేసే పరిస్థితి లేదన్నారు. రాబోయే రెండున్నరేళ్ల కాలంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రాబోతుందని అన్నారు.