30-01-2026 03:25:51 PM
జిల్లా కలెక్టర్ కె. హరిత
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా మహిళా సాధికారిత కేంద్రం నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవము కార్యక్రమ వేడుకలకు జిల్లా కలెక్టర్ కె. హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ కలసి జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. బాలికలను రక్షించుకుందాం, వారిని చదివిద్దాం, వారిని ఎదుగునిద్దాం. వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్య, వారి హక్కుల కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయని, అందులో భాగంగానే 'బేటీ బచావో - బేటీ పడావో' కార్యక్రమము చేపడుతున్నది బాలికల పై పోక్స్ కేసులు నమోదు చేసి శిక్షలు విధించడం జరుగుతుందని చెప్పారు. బాలికలు తమకు లభించిన సౌకర్యాలను ఉపయోగించుకొని తమ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని, విద్యతో పాటు తమకు తాము ఎంచుకున్న రంగాలలో ముందుకు సాగాలని సూచించారు.
ప్రపంచంలో అత్యంత ధనిక దేశమైన అమెరికాలో కూడా ఇంతవరకు ఒక మహిళకు అధ్యక్ష పదవి లభించలేదని, కానీ భారత దేశంలో మహిళలు రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, గవర్నర్లుగా, రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా రాణించారని, ఇది మన ప్రభుత్వాలు కల్పిస్తున్న హక్కులు అని తెలిపారు. ఈ సందర్భంగా బాలికలకు వ్యాస రచన, పాటల పోటీలలో గెలుపొందిన బాలికలకు బహుమతులు అందజేశారు. అనంతరం బాలికలు ప్రదర్శించిన సాంప్రదాయ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మహేష్, GCDO శకుంతల, EE మిషన్ భగీరథ సిద్ధిక్ జిల్లా గిరిజన క్రీడల సంక్షేమ శాఖాధికారి మడవి శoబు , జిల్లా మహిళా సాధికారిత సమన్వయికర్త శారద , సభ్యులు, రాణి మమతా సఖి సిబ్బంది షిరి టైం సభ్యులు బాలికలు ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.