calender_icon.png 13 December, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీపీ కారు దగ్ధం

13-12-2025 06:27:53 PM

అర్మూర్ (విజయక్రాంతి): అర్మూర్ మండల మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య కారును శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఈ సంఘటన చోటుచేసుకోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పస్క నర్సయ్య స్వగ్రామం నూతనంగా ఏర్పడిన ఆలూరు మండలం మచ్చర్ల గ్రామం. మచ్చర్ల గ్రామం జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ గ్రామంలో ఇద్దరు మహిళలు సర్పంచి పదవికి పోటీలో ఉన్నారు. ఇద్దరిలో ఒకరికి పస్క నర్సయ్య సపోర్టుగా ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమె గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో నర్సయ్య కారుకు పెట్రోల్ పోసి నిప్పటించారు.

అది గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసి నర్సయ్యను లేపారు. ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇచ్చి మంటలు అర్పించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటనా స్థలం సమీపంలోని మురికి కాలువలో పెట్రోల్ డబ్బా, చేతి గ్లౌస్ లు లభించాయి. దీని వెనుక రాజకీయ కోణం దాగి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థి అభ్యర్థి వర్గీయులే కారుకు నిప్పంటించారానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అర్మూర్ ఎస్.హెచ్.ఓ. సత్యనారాయణ తెలిపారు.