13-12-2025 08:14:15 PM
పటాన్ చెరు: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో లక్ష 20 వేలకుపైగా ఓటర్లు, రెండు లక్షలకు పైగా జనాభా ఉన్నప్పటికీ ప్రస్తుతం కేవలం రెండు డివిజన్లుగా విభజన చేయడం సరికాదు అని మాణిక్ యాదవ్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో 30 వేల ఓటర్లకు అనుగుణంగా నూతనంగా నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ హేమంత్ బోర్కడేకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు మెరుగైన పరిపాలన, సౌలభ్యం కల్పించేందుకు మొత్తం మీద డివిజన్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సుల్తాన్ పూర్ డివిజన్ పరిధిలో అనేక అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించి అమలు చేయాలని కమిషనర్ ని కోరారు.