calender_icon.png 13 December, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండవ విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

13-12-2025 07:52:52 PM

జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్..

కోదాడ: జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనైనదని జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టర్  నడిగూడెం, కోదాడ, అనంతగిరి మండలాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను సందర్శించారు. ఆయా డిఆర్సి కేంద్రాలలో కలెక్టర్ మాట్లాడుతూ నడిగూడెం మండలంలో 16 గ్రామ పంచాయతీలకు గాను 1 గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయినదని, మిగతా 15 గ్రామ పంచాయతీల పోలింగ్ కొరకు 136 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనైనదని, కోదాడ మండలంలో 16 గ్రామ పంచాయతీలకు గాను 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినవని, మిగతా 14 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఇందుకొరకు 138 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడినవని అన్నారు.

అలాగే అనంతగిరి మండలంలో 20 గ్రామ పంచాయతీలకు గాను 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినవని, మిగతా 17 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఇందుకొరకు 139 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడినవని పి ఓలు, ఏపీవోలు పోలింగ్ సామాగ్రిని, బ్యాలెట్ బాక్స్ లను బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలని, బ్యాలెట్ పేపర్లు క్రమ పద్ధతిలో ఉన్నాయో లేదో మరోసారి పరిశీలించుకోవాలని చెప్పారు. పోలింగ్ తదుపరి మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టాలని, మధ్యాహ్నం 1 గంట తరువాత ఓటర్లు లైన్ లో ఉంటే వారికి టోకెన్ లు కేటాయించి ఓటు వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్లు సతీష్, శ్రీనివాస్ ఆర్డిఓ సూర్యనారాయణ, ఎంపీడీవోలు  మాల్సూర్, ఇషాక్ హుస్సేన్, హరిసింగ్, తహసీల్దార్ లు  రామకృష్ణ రెడ్డి, వాజిద్ అలీ, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.