calender_icon.png 13 December, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం..

13-12-2025 07:57:01 PM

కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి..

బజార్ హత్నూర్ (విజయక్రాంతి): గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ప్రజలకు చేసేంది ఏమి లేదని, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి వేణు గోపాల చారి అన్నారు. శనివారం బజార్ హత్నూర్ మండలంలోని దహెగాం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ తో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. 

వేణుగోపాల చారి మాట్లాడుతూ... పోయిన సర్కరు ఏ ఒక్క గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లను ఇవ్వలేదని, కానీ ప్రజా ప్రభుత్వం రెండు యేండ్లలో బోథ్ నియోజకవర్గనికి వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చిందాన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నా కేసీఆర్ ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం రెండు యేండ్లలో 60 వేలకు పైగా ఉద్యోగలు ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, పలువురు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.