calender_icon.png 13 December, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన మాద్రి ప్రిథ్వీరాజ్

13-12-2025 07:36:53 PM

పటాన్ చెరు: సమాజ సేవనే లక్ష్యంగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ సేవలందిస్తున్న మాద్రి ప్రిథ్వీరాజ్ తన విద్యా ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. అమెరికాలో ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్(IBM) విద్యను అభ్యసించిన అనంతరం, గత నాలుగు సంవత్సరాలుగా నిబద్ధతతో ఎల్.ఎల్.బి (LLB) విద్యను అభ్యసించి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో అడ్వకేట్‌గా నమోదు పొందుతూ ప్రొవిజనల్ ఎన్‌రోల్మెంట్ సర్టిఫికేట్‌ను స్వీకరించారు. ప్రజా సేవ, న్యాయ పరిరక్షణ, సామాజిక న్యాయం పట్ల తనకున్న అంకితభావంతో న్యాయవృత్తిలో కూడా ప్రజల పక్షాన నిలబడాలని సంకల్పం వ్యక్తం చేసిన మాద్రి ప్రిథ్వీరాజ్ కి ఇది మరో గౌరవప్రదమైన అధ్యాయం. విద్యతో సేవ సేవతో న్యాయం ఇదే మాద్రి ప్రిథ్వీరాజ్ మార్గదర్శనం.