13-12-2025 08:06:46 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్(ఎస్వివి) కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ గురువారం జరిగిన ఎన్నికల్లో ఆయన స్వగ్రామమైన నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సర్పంచుగా ఎన్నికయ్యారు. గతంలో గ్రామ ఉపసర్పంచిగా ఎన్నికైన యాకాంతం గౌడ్ గ్రామ అభివృద్ధికి ఐదేళ్లపాటు గ్రామ యువత తోడ్పాటుతో విశేషంగా కృషి చేశారు. సర్పంచి పదవి ఈసారి ఆయన పోటీ చేయడానికి అనుకూలంగా రావడంతో సర్పంచిగా పోటీ చేసి విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో శనివారం కేసముద్రం పట్టణంలోని ఎస్వీవీ పాఠశాలకు రాగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు యాకాంతం గౌడ్ కు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యాకాంతం గౌడ్ మాట్లాడుతూ విద్యాభివృద్ధితో పాటు, తన గ్రామ అభివృద్ధికి కూడా నిబద్ధతతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.