calender_icon.png 13 December, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీని ఓడిస్తేనే బీసీ రిజర్వేషన్లకు మేలు

13-12-2025 06:25:44 PM

రాహుల్ గాంధీ ద్వారా రిజర్వేషన్లు అమలు

జాతీయ స్థాయి పోరాటానికి కాంగ్రెస్ సిద్ధం

పెద్దపల్లి (విజయక్రాంతి): ఓబీసీ రిజర్వేషన్లు పార్లమెంట్ ప్రక్రియ ద్వారా సాధించేందుకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం నడిపేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలో వ్యూహరచన జరుగుతుందని ఓబీసీ ఉద్యమకారులు తాడూరి శ్రీమన్నారాయణతో పాటు గుంటి స్వరూప కృష్ణ మల్లికార్జున హసీనా తెలిపారు. శనివారం న్యూఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం సందర్శించి జాతీయ స్థాయిలో ఓబీసీ ఉద్యమం ఆవశ్యకతపై ఏఐసిసి అగ్ర నాయకులకు వివరించినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీమన్నారాయణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వము లో 42 శాతం రిజర్వేషన్ల సాధనకై అసెంబ్లీ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి బిల్లు పంపిన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టలేదని శ్రీమన్నారాయణ ఆవేదన చెందారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రస్తావించాలని ఏఐసిసి పెద్దలను కోరినట్లు తాడూరి శ్రీమన్నారాయణ తెలిపారు. రాష్ట్రపతికి పంపిన బిసి బిల్లును బిజెపి భాగస్వామ్య ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు. తెలంగాణలో 8 మంది బిజెపి ఎంపీలు 42% రిజర్వేషన్లపై పార్లమెంట్లో ప్రస్తావించకపోవడం సిగ్గుచేటన్నారు. బీసీ ప్రధానమంత్రి అయిన మోడీ 50% బీసీ సీలింగ్ ను రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించాలని శ్రీమన్నారాయణ డిమాండ్ చేశారు. ఓబీసీ రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేక వైఖరి అవలంబిస్తుందని, ఓబిసి రిజర్వేషన్ వర్తింపచేయడం ద్వారా అర్థమైనట్లు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోదో యాత్రలో భాగంగా రాజ్యాంగం ప్రకారం సంపదలో ఉద్యోగ రాజకీయ ఉపాధి రంగాలలో ఎవరి వాటవారికి ఇచ్చేందుకు రవి ముందుకు రావడం అర్షనీయమని అన్నారు. రాహుల్ గాంధీ ద్వారానే చట్టసభలతో పాటు స్థానిక సంస్థలలో ఓబీసీ రిజర్వేషన్ల సాధన జరుగుతుందని, భారత ప్రజలు ఎదురుచూస్తున్నట్లు వారు విశ్వాసం వ్యక్తం చేశారు.