calender_icon.png 13 December, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరైనా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: కంగ్టి సీఐ

13-12-2025 08:12:37 PM

సిర్గాపూర్/కంగ్టి/కల్హేర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కంగ్టి సీఐ వెంకటేష్ రెడ్డి శనివారం పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ... సిర్గాపూర్/కంగ్టి/కల్హేర్ మండల పరిధిలో ప్రజలకు సీఐ వెంకట్ రెడ్డి హెచ్చరిక చేశారు. ఎన్నికల దృశ్య ఎన్నికల కమిషన్‌ అన్నీ గమనిస్తోంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న వేళ.. 'ఏం ఫర్వాలేదులే' అన్న ధోరణితో ఎవరు ఉల్లంఘనలకు పాల్పడినా కేసులు తప్పవని అన్నారు. ఒక్కసారి కేసు నమోదైతే అది కొన్నేళ్లపాటు వెంటాడుతూనే ఉంటుందని, నేరం నిరూపితమైతే తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.

గ్రామాల్లో తాగి న్యూసెన్స్ చేసినా, ఎదుటి వారిని రెచ్చగొట్టినా, గొడవకు దారి తీసిన, ఎదుటి వారి ప్రచారానికి అడ్డు పడిన, లాండ్ ఆడర్ సమస్యను సృష్టించిన బారి మూల్యం చెల్లించుకావలిసి వస్తుంది, తిప్పలు తప్పవన్నారు. కేసులది ఏముందిలే... అని చాలామంది బాహాటంగానే నిబంధనలను ఉల్లంఘిస్తుంటారు, కానీ అవి నమోదైతే కొన్నేళ్లపాటు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది, సదరు నాయకులు ఎన్నికల్లో పాల్గొన్న ప్రతిసారీ ఈ కేసుల గురించి ప్రస్తావించాలీ. కొన్ని ప్రభుత్వ పథకాల వంటివి పొందాలన్నా కేసుల ప్రస్తావన తప్పనిసరి, ప్రభుత్వ ఉద్యోగాలు, ముఖ్యంగా పోలీసు శాఖలోకి ఎంపిక కావాలంటే కేసులు కచ్చితంగా అడ్డంకిగా మారతాయని ఇక విదేశాలకు వెళ్లాల్సి వస్తే పాస్‌పోర్ట్ కు దరఖాస్తు చేసుకుంటే ఈ కేసులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకే ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిల్సిన అవసరం ఉంది కాబట్టి జరా జాగ్రత్త అని సీఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు.