13-12-2025 06:31:49 PM
ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి..
మణుగూరు (విజయక్రాంతి): కొత్తగూడెం సింగరేణి ప్రధాన వైద్యశాలకు హైదరాబాద్ టి ఎక్స్ హాస్పిటల్ నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఆదివారం రానున్నారని, వారి వైద్య సేవలను అవసరమైన ఏరియా కార్మికులు వారీ కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రోలలో వైద్య సేవలను అందించేందుకు యాజమాన్యం సంకల్పించిందన్నారు.
కార్మికుల పరిపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ హాస్పిటల్ లతో ఒప్పందం చేసుకొని ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారని, అనేక వ్యయప్రయాసాల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి ప్రత్యేక వైద్య సేవలు కోసం వచ్చే రోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వచ్చిన వారందరికీ ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సకాలంలో హాస్పిటల్ కు వైద్యులు చేరుకునేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సింగరేణి అధికారులను కోరారు.