25-10-2025 12:00:00 AM
-భార్య ఫిర్యాదుతో వెలుగులోకి
బెల్లంపల్లి, అక్టోబర్ 24 : బెల్లంపల్లి మాజీ మండల పరిషత్ అధ్యక్షులు గోమాస శ్రీనివాస్‌ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయ డం స్థానికంగా కలకలం రేపింది. మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌పై రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో కొంతమంది భూ బాధితులు తమ కు నకిలీ పత్రాలు చూపించి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో గురువారం మధ్యాహ్నం బెల్లంపల్లి ప్రాంతంలో గుర్తు తెలియని వాహనంలో కొంతమంది వచ్చి శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసిన ట్లు తెలుస్తుంది.
కుటుంబ సభ్యుల కథ నం మేరకు గురువారం ఉదయం ఇం ట్లో నుండి వెళ్లిన గోమాస శ్రీనివాస్ సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని భార్య అమృత తన భర్త శ్రీనివాస్ ఆచూకీ తెలియడం లేదని తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చిం ది. కాగా ఈ ఘటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. బాధితులకు డబ్బులు చెల్లించకుండా ఉండేందుకు శ్రీనివాస్ కిడ్నాప్ డ్రామాకు తెర తీశారా? లేక నకిలీ భూమి పత్రాలు చూపి డబ్బులు వసూ లు చేసిన వ్యవహారంలో ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అనే అంశం పోలీసుల దర్యాప్తులో తేలనుంది.