మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ డ్రైవర్ అరెస్ట్
- పరారీలో సుమంత్.. మరికొందరిపై కేసు నమోదు
- ఓ వ్యాపారిని బెదిరించి రూ.10 కోట్లు డిమాండ్
- మేడిపల్లి పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్.. జూబ్లీహిల్స్ పీఎస్‌కు బదిలీ
రామచంద్రాపురం, ఆగస్టు 23: ఓ వ్యా ప్యారిని బెదిరించి రూ.10 కోట్లు డిమాండ్ చేసిన కేసులో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ ఎన్ సు మంత్ డ్రైవర్‌ను పోలీసులు ఆదివారం అరె స్ట్ చేశారు. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లోని సుమంత్ నివాసం వెలుపల పోలీసులు సదరు డ్రైవర్‌ను అదుపులోకి తీ సుకున్నారు. మాజీ ఓఎస్‌డీ మాత్రం పరారీ లో ఉన్నాడు. ఈ ఘటనలో సుమంత్‌తో స హా మరికొందరికిపై హత్యాయత్నం కింద కేసు నమోదైనట్లు తెలిసింది.
ఈ ఘటనపై తొలుత మేడిపల్లి పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా.. తర్వాత జూబ్లీహిల్స్ పీఎస్ కు బదిలీచేశారు. బోడుప్పల్‌కు చెందిన గొం గడి హరికృష్ణ అనే వ్యాపారిని బెదిరించి రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారనే ప్రధాన ఆరోపణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌పై ఉంది.






