30-12-2025 11:56:36 AM
జిన్నారం/అమీన్ పూర్: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయానికి మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్ 2 లక్షలు రూపాయలు విరాళం అందజేశారు, నిర్మాణం ప్రారంభించండి ఇంకా 3 లక్షలు ఇస్తానని మాట ఇచ్చారు. అమ్మవారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.