06-09-2025 06:29:01 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం చందాయిపేటలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్న వ్యాయామ ఉపాధ్యాయుడు శంకర్ చారికి గురుపూజోత్సవ దినోత్సవం సందర్భంగా సన్మానం చేసిన స్థానిక తాజామాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్. అనంతరం పాఠశాల ఉన్న ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ... మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం.
మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటున్నామని, ఉపాధ్యాయులను సన్మానించుకోవడం గొప్ప విషయమని, సన్మానం పొందిన ఉపాధ్యాయుల మీద ఇంకా గురితరమైన బాధ్యత పెరుగుతుందని ఇంకా భవిష్యత్తులో మండలానికి మంచి పేరు తీసుకు రావాలని కోరారు,