calender_icon.png 17 January, 2026 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీకి మాజీ జడ్పీ చైర్మన్ రాజీనామా

17-01-2026 08:17:41 PM

చెన్నూర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి శనివారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో విడుదల చేసిన 6 గ్యారెంటీలు, 420 హామీలు, చెన్నూర్ మేనిఫెస్టో ఆకర్షితులై అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు, స్థానిక శాసనసభ్యులు గడ్డం వివేక్ విజయానికి విశేష కృషి చేసి గెలిపించినామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని,

మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న సందర్భంలో కాంగ్రెస్ ప్రకటించిన హామీలపై ప్రజల్లో తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అంతేకాకుండా స్థానిక ఎంఎల్ఏ వివేక్ ఎన్నికల ప్రచారంలో చెన్నూరు నియోజక వర్గానికి ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం, పార్టీలో ఒంటెద్దు పోకడ, ఏకపక్ష నిర్ణయాలు, నియంత పరిపాలన మమ్మల్ని తీవ్రంగా కలచి వేసిందనీ ఆవేదన వ్యక్తం చేశారు.

చెన్నూరు నియోజకవర్గంలో 45 వేల మంది యువకులకు ఉద్యోగాలు, మైనింగ్ ఇన్స్టిట్యూట్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు. అగ్రిరీసెర్చ్ సెంటర్, అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ, కరకట్టల నిర్మాణం వంటి అనేక హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీకి కూడా ముందడుగు పడలేదనీ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, ఎమ్మెల్యే వివేక్ పై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, వివేక్ విడుదల చేసిన మోసపూరిత మేనిఫెస్టోతో ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయామనీ, అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.