calender_icon.png 17 January, 2026 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రతపై నూతనకల్ పోలీసుల వినూత్న ప్రచారం

17-01-2026 08:13:26 PM

వాహనదారులతో ఎస్సై నాగరాజు ప్రతిజ్ఞ

​నూతనకల్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా  ఎస్సై నాగరాజు శనివారం మండల కేంద్రంలో వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.మండల పరిధిలోని ప్రమాదకర ప్రాంతాల్లో వాహనదారులను ఆపి, రోడ్డు నియమ నిబంధనల పట్ల వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై నాగరాజు పోలీస్ సిబ్బందితో కలిసి పౌరులచే రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.​ ప్రయాణ సమయంలో ముందస్తు జాగ్రత్తలు పాటిస్తామని, అతివేగంతో ప్రయాణించి ఇతరులకు ఇబ్బంది కలిగించబోమని, నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరుకుంటామని వాహనదారులు ఈ సందర్భంగా ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా ఎస్సై నాగరాజు మాట్లాడుతూ.... "ప్రతి ప్రాణం ఎంతో విలువైనదని,ప్రయాణాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కుటుంబాలకు తీరని లోటును మిగులుస్తుందన్నారు.అందుకే ప్రతి బైక్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలను నిలిపి ఇతర ప్రయాణికులకు ఆటంకం కలిగించకూడదన్నారు. అతివేగం ప్రమాదకరం అని గుర్తించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.​ ముఖ్యంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న చోట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు స్థానిక వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.