25-10-2025 06:32:09 PM
పెద్దపల్లి (విజయక్రాంతి): మండలంలోని జాఫర్ ఖాన్ పేట గ్రామంలోని నాగదేవత ఆలయంలో నాగుల చవితి సందర్భంగా మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి పాల్గొని నాగదేవత విగ్రహానికి పంచామృతలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం జండా కార్యక్రమం నిర్వహించి, నాగదేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.