calender_icon.png 26 October, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెబాట పట్టిన విద్యుత్ అధికారులు

25-10-2025 06:30:05 PM

చేగుంట: వివిధ గ్రామాలలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ అధికారులు "పల్లెబాట" కార్యక్రమాన్ని చేగుంట ఏఈ సంపత్ కుమార్ చందాయిపెట్ గ్రామంలో చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల వద్ద సమస్యలు, విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించే చెట్లను, తొలగించడం వంటి పనులను చేపడతారు. ఈ కార్యక్రమాన్ని మండలంలో ఎస్ఈ సంపత్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు.

ఈ సందర్బంగా ఏఈ మాట్లాడతూ పల్లెబాట కార్యక్రమం గ్రామాల్లోని విద్యుత్ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం, చేపట్టే పనులు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల వద్ద ఉన్న సమస్యలను సరిచేయడం, విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించే చెట్లను తొలగించడం, ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరాను అందించడం, విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచడం దీని ఒక్క లక్షమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ అధికారులు,లైన్ మెన్ అంజగౌడ్, ఆపరేటర్ లాలు, గ్రామస్తులు ఎర్రగోళ్ళ సతయ్యా, ఎర్రగోళ్ళ యాదయ్య, అవుబోతు రమేష్, అవుబోతు పోచయ్య,రమేష్, తదితరులు పాల్గొన్నారు.