calender_icon.png 14 September, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్మశానంలో వ్యభిచారం

14-09-2025 01:21:13 AM

  1. గ్రేవీయార్డు రూమ్‌లో దందా

సిటీ నడిబొడ్డున అసాంఘిక కార్యకలాపాలు

నిర్వాహకురాలు, విటుడు అరెస్టు

ఓ యువతికి విముక్తి కల్పించిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ ౧౩ (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం నడి బొడ్డున అసాంఘిక కార్యకలాపాలు కలకలం సృష్టించాయి. ఏకంగా  ఓ మహిళ శ్మశానాన్నే అడ్డాగా మార్చుకుని వ్యభిచారం దందా నడుపుతున్నది.  ఇక్కడైతే ఎవరికి అనుమానం రాదని, అక్రమ దందా హ్యాపీ గా చేసుకోవచ్చని భావించింది కానీ, పోలీసులు పసిగట్టి వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు.

ఇందుకు సంబందించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని బేగంపేట శ్యామ్ లాల్  బిల్డింగ్స్ సమీ పంలో ఉన్న శ్మశానవాటికలోని గదిని నిందితురాలు వ్యభిచార గృహంగా మార్చిం ది. తన భర్తే ఆ గ్రేవీ యార్డుకు  ఇన్చార్జి కావడంతో ఎవరికి ఇనుమానం రాకుండా జాగ్ర త్త పడింది. అయినా సమాచారం తెలియడంతో శనివారం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

నిర్వాహకురాలు, విటుడిని అరెస్ట్ చేశారు. ఓ యువతిని రక్షించారు. పలు ప్రాంతాల నుంచి యువతు లను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసు లు తెలిపారు. విటుడిని ఓ కాంట్రాకర్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్మశాన వాటిక ఇన్ చార్జీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. దీనిపై స్పందిస్తున్న స్తున్న నెటిజన్లు.. స్మశానాన్ని కూడా వదలరెంట్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.