calender_icon.png 14 September, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరేడ్‌మెట్ షిర్డీ సాయి కాలనీ రోడ్డు సమస్యపై ప్రజల ఆగ్రహం

14-09-2025 01:19:09 AM

మల్కాజిగిరి, సెప్టెంబర్ 13(విజయక్రాంతి) : నేరేడ్మెట్ డివిజన్ లోని షిర్డీ సాయి కాలనీ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్ మట్టి కుప్పలు, చెట్టు కొమ్మలు బెతేల్ మార్థోమ చర్చి ఎదురుగా తొలగించకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితితో షిర్డీ సాయి కాలనీ మరియు యాదవ బస్తీ వాసు లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సెయింట్ థామ స్ స్కూల్ కి వెళ్లే రహదారులపై రాకపోకలు ఇబ్బందికరంగా మారాయని, ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కాలనీవాసులు ఫోన్ ద్వారా తమ సమస్యను తెలియ జేయగా, తక్షణమే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యం లో బృందం సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిశీలించారు.

అనంతరం జిహెచ్‌ఎంసీ ఏఎమ్‌హెచ్‌ఓ మంజుల తో ఫోన్లో సంప్రదించి, రహదారి మధ్యలో ఉన్న చెట్టు కొమ్మలు, మట్టి కుప్పలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో నవీన్, శ్రీకాంత్, గంగపుత్ర రవి, సక్కుబాయి, చరణ్, అరవింద్, నిశాంత్ సహా కాలనీవాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.