calender_icon.png 14 September, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం గోస

14-09-2025 01:21:36 AM

కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా బీబీపేటలో సింగిల్ విండో కార్యాలయ సిబ్బందిపై దాడికి యత్నం 

అడ్డుకున్న పోలీసులు

పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి.. టోకెన్ల పంపిణీ

కామారెడ్డి, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో యూరియా కోసం రైతుల ఆందోళనలు తప్పడం లేదు. తెల్లవారుజామునే విక్రయ కేంద్రాలు, సొసైటీల వద్ద క్యూ కడుతు న్న బస్తాలు దొరకడం లేదు. దీంతో రైతులు వ్యవసాయ సిబ్బందిపై, ప్రభుత్వాలపై ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు.    శనివారం కామారెడ్డి జిల్లా బీబీపేట సింగిల్ విండో కార్యాలయం లో రైతులు యూరియా బస్తాల కోసం క్యూ కట్టారు.

600 యూరియా బస్తాలు మాత్ర మే రావడంతో తమకు కూపన్లు వస్తావో రావో అని రైతులు ఆందోళనకు గురయ్యా రు. ఈ క్రమంలో రైతులు తోపులాడుకోవడంతో విండో సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశా రు. దీంతో రైతులు విండో సిబ్బందిపై దాడికి యత్నించారు. కుర్చీలను బయట విసిరివేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు చేరుకొని రైతులను సముదాయించారు.

మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, బీబీపేట మాజీ ఎంపీపీ వచ్చి రైతు ల సమస్యపై విండో అధికారులతో చర్చించా రు. కొందరికే యూరియా బస్తాలు ఇవ్వడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్ల వారిగా పంపిణీ చేయాలని వారు కోరారు. విండో సిబ్బంది చేతివాటం వల్ల ఘర్షణ వాతావరణం వాటిల్లిందని మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ తెలిపారు.

అనంతరం రైతులందరినీ పోలీస్ స్టేషన్ ఆవరణలోకి పిలిచి క్యూలో కూర్చోబెట్టి, టోకెన్లు, యూరియా పంపిణీ చేశారు. మిగతా రైతులకు త్వరలో వస్తాయని పోలీసులు సముదాయించారు. కామారెడ్డి విండో పరిధిలోని రైతులకు 16వ తేదీన యూరియా పంపిణీ చేసేందుకు రైతులు క్యూ లో నిల్చున్నారు. పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో టోకెన్లను అందజేశారు. వర్షం పడుతున్న సైతం యూరియా కోసం రైతులు క్యూ కట్టి టోకెన్లు పొందారు. 

ఫెర్టిలైజర్ షాప్‌ల వద్ద పడిగాపులు

నిర్మల్/నకిరేకల్(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఫెర్టిలైజర్ షాప్‌ల వద్ద యూరియా కోసం శనివారం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ లో నిల్చున్నారు. నకిరేకల్ పట్టణంలోని మన గ్రోమోర్ వద్ద రైతులు బారులు తీరడంతో ఒకరికొకరు తోసుకున్నారు.

స్థానిక ఎస్సై లచ్చిరెడ్డి, సిబ్బంది ఆధ్వర్యంలో యూ రియా పంపిణీ చేయించారు. నిర్మల్ జిల్లాలో కుంటాల, బైంసా, లోకేశ్వరం, దస్తురాబాద్, ఖానాపూర్ మండలాల్లో పిఎసిఎస్ కేంద్రాల వద్ద రైతులు బారు లు తీరారు. సత్తనపల్లిలో సరిపడా ఎ రువులు ఇవ్వాలని రైతులు పీఏసీ కా ర్యాలయం ఎదుట నిరసన తెలిపారు