6 August, 2026 | 10:17 PM

వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని ఆదేశం

06-08-2026 09:10 PM

భూపాలపల్లి,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో కేజీబీవీ పాఠశాల ప్రహారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి నెలలు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడంపై టీజీఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ  ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన డీఈ రామకృష్ణతో ఫోన్‌లో మాట్లాడి వారం రోజుల్లోగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

పాఠశాలలో భోజనశాల పరిశుభ్రత, ఆహార నాణ్యతను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. నల్గొండలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఇంటర్ విద్యార్థిని అంజలిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మి రాజయ్య, ఎంపీడీఓ తరుణ్ ప్రసాద్, ఎస్వో ఈశ్వరి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.