24 August, 2026 | 10:49 AM

Breaking News

ఇల్లు కాదు.. ఇది కలల సాకారం..!

19-06-2025 05:09 PM

ఇదే ఒక సత్యమైన సంకల్పం

ఇదే ఒక మార్పుకు సంకేతం

ఇందిరమ్మ కల సాకారం చేస్తున్న నాయిని

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

 వరంగల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం(Warangal West Constituency)లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ(Indiramma Houses Construction) పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) గురువారం ఘనంగా నిర్వహించారు. 60వ డివిజన్ వడ్డేపల్లి, 58వ డివిజన్ ఎస్సీ కాలనీ, 57వ డివిజన్ సమ్మయ్యనగర్ కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి, పనులను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, ఇప్పటికి రాష్ట్రంలో చాలా చోట్ల ఇందిర్మ కాలనీలు ఉంటాయని గుర్తు చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ... ఇల్లు అనేది ఒక వ్యక్తికి ఆశ్రయం మాత్రమే కాదు – అది గౌరవం, భద్రత, స్వాతంత్ర్యం అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా ప్రతి పేద కుటుంబానికి ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని తెలిపారు. మొత్తం మూడు డివిజన్లలో ప్రారంభించిన ఇండ్ల నిర్మాణ పనులు వందలాది కుటుంబాలకు ఆశ కలిగించాయని వెల్లడించారు.

పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 3500 ఇళ్లకు ప్రతి ఒక్క ఇల్లు నిజమైన అర్హులకు కేటాయించామన్నారు. లబ్ధిదారులు తమ మనసు తల్లడి కళ్లలో ఆనందంతో ఎమ్మెల్యేని ప్రత్యేకంగా సన్మానించారు. అంతకు ముందు 60వ డివిజన్  వడ్డేపల్లి కాలనీలో రూ.5 లక్షలతో కల్వర్ట్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాల నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.