13-09-2025 03:00:37 AM
- మెదక్ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి
- ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
మెదక్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి):జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, కాజ్వేలు, చెరువులు, తాత్కాలికంగా చేపడుతున్న పనులు, శాశ్వతంగా చేపట్టే పనులపై జిల్లా కలెక్టర్ రా హుల్ రాజ్ తో కలిసి ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులతో శుక్రవా రం కలెక్టరేట్లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సమీక్షించారు.
ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్రజా పాలనలో నియోజకవర్గ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. ఎస్ డి ఆర్ ఎఫ్‌నిధులు 10 కోట్లు ఉన్నాయని, విపత్తు నిధులు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామ న్నారు. భారీ వర్షాలు వరదలతో జిల్లాలో పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి శాఖలకు సంబంధించిన రోడ్లు కల్వర్టులు, చెరువులు పెద్ద ఎత్తున నష్టం వాటిలిందని చెప్పారు. ఎస్ డి ఆర్ ఎఫ్ నిధులతో తాత్కాలిక, శాశ్వత పనులు అంచనాలు సంబంధిత శాఖల ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు.
అనంతరం మెదక్ సుందరీకరణపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ,మున్సిపల్ డి ఈ తో కలిసి చర్చించారు.మెదక్ పట్టణం సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని, మెదక్ అన్ని జిల్లాల కంటే వినూత్నంగా ముందు వరుసలో ఉండాలని, ఎంట్రన్స్ రోడ్డు లైటింగ్, మూడు చౌరస్తాలు సుందరీకరణ, బ్రాస్ మెటీరియల్ తో అంబేద్కర్ విగ్రహం తయారు చేయించాలని, మెదక్ చర్చిలో సెంట్రల్ లైటింగ్ ఇంటర్నల్ సిసి రోడ్స్ సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈ ఈ సర్దార్ సింగ్, పంచాయతీరాజ్ ఈఈ నరసింహులు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య ప్రణాళికా అధికారి, సంబంధిత శాఖల అధికారులుపాల్గొన్నారు.